భారత ఫుట్‌బాల్‌ జట్టుకు నిరాశ  | Disappointment for Indian football team | Sakshi
Sakshi News home page

భారత ఫుట్‌బాల్‌ జట్టుకు నిరాశ 

Sep 11 2023 2:23 AM | Updated on Sep 11 2023 2:23 AM

Disappointment for Indian football team - Sakshi

కింగ్స్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు చివరిదైన నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. థాయ్‌లాండ్‌లో నాలుగు దేశాల మధ్య జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు వర్గీకరణ మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురైంది. లెబనాన్‌ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సందేశ్‌ జింగాన్‌ నాయకత్వంలోని భారత జట్టు 0–1 గోల్‌ తేడాతో ఓడిపోయింది. లెబనాన్‌ తరఫున ఆట 77వ నిమిషంలో కాసీమ్‌ ఎల్‌ జీన్‌ గోల్‌ సాధించాడు. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్‌ కెపె్టన్‌ సునీల్‌ ఛెత్రి ఈ టోరీ్నకి దూరంగా ఉన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement