"విరాట్‌ కోహ్లిని తప్పించి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది"

Dilip Vengsarkar feels split captaincy will work for India - Sakshi

Dilip Vengsarkar feels split captaincy will work for India: టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లిని తప్పించి రోహిత్‌ను ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కొంత మంది బీసీసీఐ నిర్ణయంను తప్పుబడుతుంటే.. కొంత మంది సమర్ధిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్‌..  వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదని తెలిపాడు. రోహిత్‌ శర్మ  వైట్-బాల్ క్రికెట్‌లో సారధిగా బాగా రాణించాడు. అందు వల్ల బీసీసీఐ నిర్ణయం తీసుకుందని తెలిపాడు. 

"వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మను భారత  కెప్టెన్‌గా నియమించడంలో బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా రోహిత్ బాగా రాణిస్తున్నాడు. అతడు చాలా కాలంగా  కెప్టెన్సీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది మంచి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు, విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌పై దృష్టి పెట్టగలడు. కాగా వైట్-బాల్ క్రికెట్‌లో అతను ఇప్పటివరకు నాయకుడిగా అద్బుతంగా రాణిస్తున్నాడు. రోహిత్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐదు సార్లు టైటిల్‌ను అందించాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా వచ్చిన అవకాశాల్లో రోహిత్‌ బాగా రాణించాడు". అని వెంగ్‌సర్కర్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లో ఎటువంటి గ్రూపులు లేవు.. 
స్ప్లిట్ కెప్టెన్సీ గురించి మాట్లాడూతూ.. " క్రికెట్‎లో వేర్వేరు కెప్టెన్లు ఉండడం కొత్తేమీ కాదు. ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టుకు, వన్టే, టీ20లకు వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ ప్రపంచ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తుంది. ఇక భారత డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు గ్రూపులు లేవు అని నేను భావిస్తున్నాను. జట్టులో యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధన్యత ఉంది. యువ క్రికెటర్‌లు తమకు దొరికిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి" అని వెంగ్‌సర్కర్ తెలిపాడు.

చదవండి: Rohit Sharma: దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top