ఢిల్లీ జట్టులోకి ఫాస్టెస్ట్‌ సెంచరీ వీరుడు.. ఎవరంటే? | Delhi Capitals Hunt Jake Fraser McGurk In IPL 2024, See More Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024: ఢిల్లీ జట్టులోకి ఫాస్టెస్ట్‌ సెంచరీ వీరుడు.. ఎవరంటే?

Published Thu, Mar 14 2024 10:56 AM

Delhi Capitals hunt Jake Fraser McGurk In Ipl 2024 - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు హ్యారీ బ్రూక్‌ రూపంలో గట్టి ఎదురు దెబ్బతగిలింది. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి బ్రూక్‌ దూరమయ్యాడు. గత నెలలో తన బామ్మ కన్నుమూసిన నేపథ్యంలో కుటుంబసభ్యులతో ఉండాలని బ్రూక్‌ నిర్ణయం తీసుకున్నాడు.  గత ఏడాది మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు రూ. 4 కోట్లకు బ్రూక్‌ను కొనుగోలు చేసింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ హ్యారీ బ్రూక్‌ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో ఆసీస్‌ ‍యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ పేరును ఢిల్లీ ఫ్రాంచైజీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడితో ఢిల్లీ ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

కాగా ఇటీవల కాలంలో మెక్‌గర్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడు తన పవర్‌ హిట్టింగ్‌ స్కిల్స్‌తో అందరిని అకట్టుకుంటున్నాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గత బిగ్‌బాష్‌లీగ్‌ సీజన్‌లో కూడా మెక్‌గర్క్ అదరగొట్టాడు. మెల్‌బోర్న్‌ రెనగాడ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన మెక్‌గర్క్‌.. 257 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిపై ఢిల్లీ కన్నేసింది.
చదవండి: #Rachin Ravindra: రచిన్‌ రవీంద్రకు అరుదైన అవార్డు.. తొలి క్రికెటర్‌గా

Advertisement
 

తప్పక చదవండి

Advertisement