IPL 2021, PBKS vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ ‘సిక్సర్‌’

Delhi Capitals Beat Punjab Kings by 7 Wickets - Sakshi

ధావన్‌ అజేయ అర్ధ సెంచరీ

పంజాబ్‌ కింగ్స్‌పై 7 వికెట్లతో గెలుపు

మయాంక్‌ అగర్వాల్‌ 99 నాటౌట్‌

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జోరు కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న ఆ జట్టు ఖాతాలో ఆరో విజయం చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మయాంక్‌ అగర్వాల్‌ (58 బంతుల్లో 99 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి పరుగు దూరంలో నిలిచాడు. రబడ 3 వికెట్లు తీశాడు. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.

శిఖర్‌ ధావన్‌ (47 బంతుల్లో 69 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరో అర్ధ శతకాన్ని సాధించాడు. పృథ్వీ షా (22 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు.   ఛేదనలో ఢిల్లీ ఎక్కడా తడబడలేదు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా జట్టుకు మరోసారి శుభారంభం చేశారు. వీరిద్దరి దూకుడుతో పవర్‌ప్లేలో ఢిల్లీ 63/0గా నిలిచింది. హర్‌ప్రీత్‌ బౌలింగ్‌లో పృథ్వీ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం స్మిత్‌ (24)తో ధావన్‌ జట్టును లక్ష్యం వైపునకు నడిపించాడు. చివర్లో స్మిత్‌ అవుటైనా... 18వ ఓవర్లో 6, 6, 4 కొట్టిన హెట్‌మైర్‌ (4 బంతుల్లో 16 నాటౌట్‌) ఢిల్లీకి విజయాన్ని ఖాయం చేశాడు.

స్కోరు వివరాలు
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) స్మిత్‌ (బి) రబడ 12; మయాంక్‌ (నాటౌట్‌) 99; గేల్‌ (బి) రబడ 13; మలాన్‌ (బి) అక్షర్‌ 26; హుడా (రనౌట్‌) 1; షారుఖ్‌ (సి) హెట్‌ మైర్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 4; జోర్డాన్‌ (సి) లలిత్‌ (బి) రబడ 2; హర్‌ప్రీత్‌ బ్రార్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 166.
వికెట్ల పతనం: 1–17, 2–35, 3–87, 4–88, 5–129, 6–143.
బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 4–1–37–0, స్టొయినిస్‌ 1–0–6–0, రబడ 4–0–36–3, అవేశ్‌ ఖాన్‌ 4–0–39–1, లలిత్‌ 3–0–25–0, అక్షర్‌ పటేల్‌ 4–0–21–1.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) హర్‌ప్రీత్‌ 39; ధావన్‌ (నాటౌట్‌) 69; స్మిత్‌ (సి) మలాన్‌ (బి) మెరిడిత్‌ 25; పంత్‌ (సి) మయాంక్‌ (బి) జోర్డాన్‌ 14; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17.4 ఓవర్లలో 3 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–63, 2–111, 3–147.
బౌలింగ్‌: మెరిడిత్‌ 3.4–0–36–1, షమీ 3–0–37–0, బిష్ణోయ్‌ 4–0–42–0, జోర్డాన్‌ 2–0–21–1, హర్‌ప్రీత్‌ 3–0–19–1, దీపక్‌ హుడా 2–0–11–0.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top