ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నరేందర్‌ ముందంజ..

Deepak Sumit and Narender maintain Indias winning run at the 2021 Mens World Boxing Championship - Sakshi

బెల్‌గ్రేడ్‌: ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. నరేందర్‌ బెర్వాల్‌ (ప్లస్‌ 92 కేజీలు), సుమిత్‌ (75 కేజీలు), నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు), గోవింద్‌ సహని (48 కేజీలు) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్‌లో నరేందర్‌ 4–1తో ఒస్కార్‌ సఫర్యాన్‌ (పోలాండ్‌)పై నెగ్గగా... సుమిత్‌ 5–0తో డామన్‌ ఒనీల్‌ (జమైకా)ను చిత్తు చేశాడు.

గోవింద్‌ 3–2తో అరియస్‌ ఒరిట్జ్‌ (ఈక్వెడార్‌)పై, నిశాంత్‌ 5–0తో లాస్లో కొజాక్‌ (హంగేరి)పై విజయం సాధించారు. 86 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ లక్ష్య చహర్‌ తొలి రౌండ్‌లో కిమ్‌ హైంగ్‌కియు (కొరియా) చేతిలో ఓడిపోయాడు.

చదవండి: Gary Kirsten: పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా.. టీమిండియా మాజీ కోచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top