పీఎస్‌ఎల్‌ వద్దు.. ఐపీఎల్‌ ముద్దు! | Unsold At Auction To IPL Comeback, Dasun Shanaka Leaves PSL Set To Join IPL In Rajasthan Royals, Read Story Inside | Sakshi
Sakshi News home page

IPL 2026: పీఎస్‌ఎల్‌ వీడుతున్న విదేశీ ఆటగాళ్లు

Mar 23 2026 7:59 AM | Updated on Mar 23 2026 9:35 AM

Dasun Shanaka Leaves PSL Set To Join IPL In Rajasthan Royals

శ్రీలంక ఆల్‌రౌండ‌ర్ దాసున్ ష‌న‌కను అదృష్టం వ‌రించింది. తంతే బూర‌ల బుట్ట‌లో పడ్డ‌ట్టుగా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆట‌గాడిగా మిగిలిపోయిన ష‌న‌క తాజాగా ఐపీఎల్ 2026 సీజ‌న్ ఆడేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ గాయంతో టోర్నీకి దూర‌మ‌వ్వ‌డంతో అత‌ని స్థానాన్ని ష‌న‌క‌తో భ‌ర్తీ చేయాల‌ని రాజస్థాన్ ఫ్రాంచైజీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

దీంతో ష‌న‌క త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భావిస్తున్నాడు. అందుకే పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌) నుంచి త‌ప్పుకోవాల‌నే నిర్ణ‌యానికి ష‌న‌క వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే రాజ‌స్థాన్ కూడా ష‌న‌క‌ను సంప్ర‌దించింద‌ని, జ‌ట్టులో జాయిన్ అయ్యేందుకు అన్ని లాంఛనాలు పూర్తయ్యాయని, సంతకాలు మాత్రమే మిగిలాయని రాజస్థాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా పీఎస్‌ఎల్ నుంచి ఐపీఎల్‌కు స్విచ్ అవుతున్న రెండో ఆటగాడు దాసున్ షనక. 

ముజరబానీ కూడా..
గతంలో జింబాబ్వే ఆటగాడు బ్లెసింగ్ ముజరబానీ కూడా పీఎస్‌ఎల్ నుంచి ఐపీఎల్‌కు షిఫ్ట్ అవ్వనున్నాడు. ముజరబానీ పీఎస్‌ఎల్‌లో షమర్ జోసెఫ్ స్థానంలో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ఆడేందుకు 1.10 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అనూహ్యంగా కేకేఆర్ నుంచి పిలుపు రావడంతో ఐపీఎల్ ఆడేందుకే మొగ్గుచూపాడు. 

వాస్త‌వానికి గ‌తేడాది అబుదాబి వేదిక‌గా జ‌రిగిన మినీ వేలంలో ష‌న‌కను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ మొగ్గు చూప‌లేదు. దీంతో ష‌న‌క అమ్ముడుపోని ఆట‌గాడిగా మిగిలిపోయాడు.  ఆ త‌ర్వాత త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌) వేలంలో పాల్గొన్నాడు. అయితే ష‌న‌కను లాహోర్ ఖలండ‌ర్స్ 75 ల‌క్ష‌లకు ద‌క్కించుకుంది.

షనక దారిలోనే స్పెన్సర్‌..
ఇక స్పెన్సర్ జాన్సర్ కూడా పీఎస్‌ఎల్ నుంచి  ఐపీఎల్‌కు రానున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్ నాథన్ ఎల్లిస్ గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో స్పెన్సర్ జాన్సన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎస్‌కే అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అయితే షనక, స్పెన్సర్‌లు పీఎస్‌ఎల్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు రావడంతో ఆయా ఫ్రాంచైజీలు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యాయి. 

కానీ విదేశీ ఆటగాళ్లు పీఎస్‌ఎల్ నుంచి ఐపీఎల్‌కు షిఫ్ట్ అవ్వడం ఇదేమీ కొత్త కాదు. గతేడాది కార్బిన్ బోష్ కూడా ఇదే విధంగా పీఎస్‌ఎల్ నుంచి తప్పుకొని ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 4న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. 

పరాగ్‌ సారథ్యంలో..
రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించిన సంజూ శాంసన్ ట్రేడింగ్‌లో చెన్నైకి వెళ్లిపోవడంతో రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. బదులుగా సీఎస్‌కే వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్థాన్‌కు బదలాయించింది. కాగా జడేజా 2008 ఐపీఎల్ తొలి టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

చదవండి: పంత్‌ను  తీసేద్దామనుకున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement