నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్‌ విజేత దబాంగ్ డేర్ డెవిల్స్ | Dabang Dare Devils Won National Amateur Golf League Kapil Dev Chief Guest | Sakshi
Sakshi News home page

National Amateur Golf league: విజేత దబాంగ్ డేర్ డెవిల్స్.. ట్రోఫీ అందజేసిన కపిల్‌ దేవ్‌

Nov 20 2022 10:32 AM | Updated on Nov 20 2022 10:32 AM

Dabang Dare Devils Won National Amateur Golf League Kapil Dev Chief Guest - Sakshi

నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ టైటిల్‌ను లక్నోకు చెందిన దబాంగ్ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని కంట్రీ క్లబ్ వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో దబాంగ్ డేర్ డెవిల్స్ 3-2 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ మైసాపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో గోల్ఫర్స్ గిల్డ్ 3-2 తేడాతో నానో ఫ్లిక్స్ టీమ్‌ను ఓడించింది.

ఈ టోర్నీ ముగింపు కార్యక్రమానికి టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్, అతర్జాతీయ గోల్ఫ్ ప్లేయర్స్ టీసా మాలిక్ , ప్రితిమా దిలావరి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సీజన్ ఛాంపియన్‌గా నిలిచిన దబాంగ్ డేర్ డెవిల్స్ టీమ్‌కు రూ. 5 లక్షల ఫ్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్ టీమ్ మైసాకు రూ.3 లక్షలు, మూడో స్థానంలోనిలిచిన గోల్ఫర్స్ గిల్డ్ జట్టుకు రూ.2 లక్షల నగదు బహుమతి వరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement