చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టూర్–250 లెవెల్ టోర్నీ చెన్నై ఓపెన్‌కు వర్షం అంతరాయం కలిగించింది. సోమవారం మొదలుకావాల్సిన మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు... ‘మోంథా’ తుపాను ప్రభావం కారణంగా నిలకడగా కురిసిన వర్షం కారణంగా సాధ్యపడలేదు. షెడ్యూల్ ప్రకారం సోమవారం 10 మ్యాచ్‌లు (2 డబుల్స్, 8 సింగిల్స్) జరగాల్సింది. అయితే వరుణ దేవుడి ప్రతాపంతో ఒక్క మ్యాచ్ కూడా ప్రారంభంకాలేదు. ఫలితంగా నిర్వాహకులు ఈ మ్యాచ్‌లను మంగళవారానికి వాయిదా వేశారు.


