భారత బ్యాటర్ల మహోగ్రరూపం.. విలవిలలాడిన నెదర్లాండ్స్‌ బౌలర్‌, చెత్త రికార్డు | CWC 2023 IND Vs NED: Logan Van Beek Conceded 107 Runs In His 10 Overs, Third Most Runs In WC Innings - Sakshi
Sakshi News home page

CWC 2023 IND Vs NED: భారత బ్యాటర్ల మహోగ్రరూపం.. నెదర్లాండ్స్‌ బౌలర్‌ ఖాతాలో చెత్త రికార్డు

Published Sun, Nov 12 2023 8:03 PM

CWC 2023 IND VS NED: Logan Van Beek Conceded Third Most Runs In WC Innings - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్ జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు భారత బ్యాటర్లు మెరుపు వేగంతో 50 అంటకంటే ఎక్కువ స్కోర్లు చేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ చేసింది.   

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఒకరికిమించి ఒకరు పేట్రేగిపోవడంతో నెదర్లాండ్స్‌ బౌలర్లు విలవిలలాడిపోయారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్‌ పేసర్‌ లొగాన్‌ వాన్‌ బీక్‌ భారత బ్యాటర్ల విధ్వంసం ధాటికి బెంబేలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన వాన్‌ బీక్‌ ఏకంగా 107 పరుగులు సమర్పించుకుని వరల్డ్‌కప్‌లో మూడో అత్యంత చెత్త బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. 

వరల్డ్‌కప్‌ హిస్టరీలో అత్యంత చెత్త బౌలింగ్‌ గణాంకాల రికార్డు కూడా నెదర్లాండ్స్‌ బౌలర్‌ పేరిటే ఉండటం విశేషం. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బాస్‌ డి లీడ్‌ ఏకంగా 115 పరుగులు సమర్పించుకున్నాడు. ఆతర్వాత వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్త బౌలింగ్‌ గణాంకాల రికార్డు ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ పేరిట ఉంది.  2019 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ 110 పరుగులు సమర్పించుకున్నాడు.
 

Advertisement
 
Advertisement