జోబర్గ్ సూపర్ కింగ్స్‌ ఫ్రాంచైజీ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌! | CSAT20 League: Stephen Fleming to Take charge of Joburg Super Kings says reports | Sakshi
Sakshi News home page

CSA T20 League: జోబర్గ్ సూపర్ కింగ్స్‌ ఫ్రాంచైజీ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌!

Aug 7 2022 6:36 PM | Updated on Aug 7 2022 6:36 PM

CSAT20 League: Stephen Fleming to Take charge of Joburg Super Kings says reports - Sakshi

దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనబోతున్న జోబర్గ్ సూపర్ కింగ్స్‌ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్‌, కివీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కాగా జోబర్గ్ సూపర్ కింగ్స్‌ ఫ్రాంచైజీను ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జోబర్గ్ సూపర్ కింగ్స్‌ కూడా పసుపు రంగు జెర్సీని ధరించనున్నట్లు తెలుస్తోంది.

ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ను వచ్చే ఏడాది జనవరి- ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రోటిస్‌ క్రికెట్‌ బోర్డు కసరత్తులు చేస్తోంది. ఇక దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ తొలి సీజన్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గోనబోతున్నాయి. అయితే ఆరుకు ఆరు జట్లను ఐపీఎల్‌ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం.

జొహన్నెస్‌బర్గ్‌, కేప్‌ టౌన్‌ ఫ్రాంచైజీలను చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకోగా.. సెంచూరియన్‌, పార్ల్‌, డర్బన్‌,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌,లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకున్నాయి. ఇక ఇప్పటికే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ లాన్స్‌ క్లూస్‌నర్‌ను డర్బన్‌ ఫ్రాంచైజీ తమ జట్టు హెడ్‌ కోచ్‌గా ఎంపిక చేసింది.
చదవండిInd Vs WI 5th T20I: వెస్టిండీస్‌తో ఐదో టీ20.. సూర్యకుమార్‌కు విశ్రాంతి! ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement