T20 Worldcup 2021: మా కెప్టెన్‌ కొన్ని మ్యాచ్‌లకు దూరం కావచ్చు! | Coach Gary Stead Says There s Always that chance of him skipping matches | Sakshi
Sakshi News home page

T20 Worldcup 2021: మా కెప్టెన్‌ కొన్ని మ్యాచ్‌లకు దూరం కావచ్చు!

Oct 21 2021 2:35 PM | Updated on Oct 21 2021 2:40 PM

Coach Gary Stead Says There s Always that chance of him skipping matches - Sakshi

Kane Williamson Injury: టీ20 ప్రపంచకప్‌ 2021లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌  కేన్ విలియమ్సన్ కొన్ని మ్యాచ్‌లకు దూరం కావచ్చని ఆ జట్టు హెడ్‌ కోచ్‌ గ్యారీ స్టెడ్ తెలిపాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోను విలియమ్సన్ బ్యాటింగ్‌కు దిగలేదు. కాగా   అక్టోబర్ 26న న్యూజిలాండ్ తమ మెదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో విలియమ్సన్‌ గాయం కివీస్‌కు ఆందోళనకరంగా పరిణమించింది. ఈ విషయంపై స్పందించిన కోచ్‌ స్టెడ్‌... వైద్య బృందం విలియమ్సన్‌ను పర్యవేక్షిస్తోందని స్టెడ్ తెలిపాడు.

అదే విధంగా కేవలం ముందు జాగ్రత్త కోసమే ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో విలియమ్సన్ బ్యాటింగ్‌కు రాలేదని పేర్కొన్నాడు. "కేన్ అద్భుతమైన బ్యాటర్‌, మా జట్టు టీ20 ప్రపంచకప్‌ కోసం అన్ని విధాలుగా సంసిద్దమైంది . ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ ఎలాంటి జట్టును ఎంచుకుంటుందనే దాని గురించి మాట్లాడుతూ.. జట్టు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో కీవిస్‌ ఓటమి చెందింది.

చదవండి: డ్యాన్స్‌తో అదరగొట్టిన స్మృతి మంధాన... నెటిజన్లు ఫిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement