ఏడేళ్ల తర్వాత పుజారా

Cheteshwar Pujara Sold To CSK For Rs 50 Lakh - Sakshi

చెన్నై:  తాను ఐపీఎల్‌కు సిద్ధమని గత కొన్ని సీజన్ల నుంచి ప్రకటిస్తూ వస్తున్న చతేశ్వర్‌ పుజారా ఎట్టకేలకు మరొకసారి ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఆడబోతున్నాడు. ఈసారి ఐపీఎల్‌ వేలంలో పుజారాను 50 లక్షల రూపాయల కనీస ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. టెస్టు క్రికెటర్‌గా ముద్ర పడిన పుజారా.. చివరిసారి 2014లో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఆడాడు. సుమారు ఏడేళ్ల తర్వాత పుజారా మరొకసారి ఐపీఎల్‌కు ఆడటం విశేషం.

కేవలం టెస్టు ప్లేయర్‌ ముద్ర కారణంగానే పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా, చివరకు సీఎస్‌కే ధైర్యం చేసి అతన్ని తీసుకుంది.  పుజారా కోసం ఎవరూ పోటీ లేకపోవడంతో సీఎస్‌కే శిబిరంలో ఆనందం వ‍్యక్తమైంది. ఈసారి వేలంలో పుజారా పేరు రాగానే సీఎస్‌కే కనీస ధరకు బిడ్‌కు వెళ్లింది. కాగా, మిగతా ఫ్రాంచైజీలు ఏవీ కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరచకపోవడంతో కనీస ధరతోనే ఐపీఎల్‌-14లో అడుగుపెట్టబోతున్నాడు పుజారా. 

ఇక్కడ చదవండి: మరో అన్‌క్యాప్‌డ్‌ ఆటగాడిపై కాసుల వర్షం

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top