సీఎస్‌కే జెర్సీపై ‘క్యామోఫ్లాజ్‌’ 

Chennai Super Kings Unveil New Jersey Featuring Camouflage patterns - Sakshi

చెన్నై: క్రికెట్‌ కిట్, గ్లవ్స్‌లతో పాటు తన దుస్తులపై కూడా చాలాసార్లు భారత ఆర్మీ ‘క్యామోఫ్లాజ్‌’ ప్రింట్‌ను ధరించిన మహేంద్ర సింగ్‌ ధోని ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జెర్సీలపై కూడా దానిని తీసుకొచ్చాడు! 2021 ఐపీఎల్‌ కోసం సీఎస్‌కే రూపొందించిన కొత్త జెర్సీలో ఆటగాళ్ల భుజాలపై ఈ ‘క్యామోఫ్లాజ్‌’ కనిపిస్తుంది. ఈ జెర్సీని బుధవారం ధోని స్వయంగా ప్రదర్శించాడు.  ధోనికి భారత ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా గౌరవ హోదా కూడా ఉంది. భారత సైనికులకు సంఘీభావంగా ఈ ప్రింట్‌ను ముద్రించినట్లు సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top