టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. వాళ్లిద్దరూ వచ్చేస్తున్నారు! ఇక తిరుగు లేదు.. | Bumrah set for RETURN in NZ ODI series, decision on Jadeja after Fitenes Test | Sakshi
Sakshi News home page

IND vs NZ: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. వాళ్లిద్దరూ వచ్చేస్తున్నారు! ఇక తిరుగు లేదు..

Dec 18 2022 12:32 PM | Updated on Dec 18 2022 12:34 PM

Bumrah set for RETURN in NZ ODI series, decision on Jadeja after Fitenes Test - Sakshi

గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించారు. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌ పర్యటన అనంతరం బుమ్రా గాయపడ్డాడు. ఈ క్రమంలో అతడు యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌, దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు.

మళ్లీ అతడు తిరిగి స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్‌కు జట్టుతో కలిశాడు. అయితే అతడి గాయం మళ్లీ తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. సృష్టంగా బుమ్రా లేని జట్టులో కనిపించింది. ఇక గాయం నుంచి కోలుకున్న బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో ఉన్నాడు. జస్ప్రీత్‌ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో బుమ్రా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.

"ప్రస్తుతం జస్ప్రీత్‌ కోలుకున్నాడు. అతడు తన ప్రా‍క్టీస్‌ను తిరిగి ప్రారంభించాడు. త్వరలోనే అతడు జట్టులోకి వస్తాడు. అయితే శ్రీలంక సిరీస్‌కు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేస్తారో లేదన్నది వేచి చూడాలి. ఒక వేళ లంకతో సిరీస్‌కు ఎంపిక కాకపోయినా.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు మాత్రం ఖచ్చితంగా జట్టులోకి వస్తాడు" అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు.

ఇక రవీంద్ర జడేజా విషయానికి వస్తే.. ఆసియాకప్‌లో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌ అనంతరం జడేజా గాయపడ్డాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా జడ్డూ మోకాలికి గాయమైంది. దీంతో అతడు ఆసియా కప్ మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చాడు. ముంబైలో మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత ఫిట్‌నెస్‌ సాధించేందుకు ఎన్సీఏలోనే కొన్నాళ్లు గడిపాడు.

ఈ క్రమంలో జడ్డూ కూడా టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఇక గాయం నుంచి కోలుకున్నాడని భావించిన సెలక్టర్లు జడ్డూను బంగ్లాదేశ్‌ పర్యటనకు ఎంపిక చేశారు. అయితే సిరీస్‌ సమయానికి అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో బంగ్లా పర్యటనకు జడేజా దూరమయ్యాడు. ఇక జడేజా కూడా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టులోకి రానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం.. శ్రీలంకను వెనక్కి నెట్టిన టీమిండియా! ఫైనల్‌ రేసులో రోహిత్‌ సేన


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement