#MarcusStoinis: పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం

Both Batters Ran Each Other-In End Stoinis Run-out Pays Heavy Price  - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓటమి దిశగా సాగుతుంది. అనవసర ఒత్తిడికి లోనయ్యి వికెట్లు చేజార్చుకుంటున్న లక్నో వరుసగా రెండో సీజన్‌లోనూ ఎలిమినేటర్‌లోనే ఇంటిబాట పట్టేలా ఉంది. 

ఇక స్టోయినిస్‌ రనౌట్‌ అయిన తీరు అయితే లక్నో సూపర్‌ జెయింట్స్‌ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో గ్రీన్‌ వేసిన ఐదో బంతిని స్టోయినిస్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా ఆడాడు. రిస్క్‌ అయినా రెండు పరుగులు తీసే అవకాశం ఉండడంతో ఇద్దరు వేగంగానే పరిగెత్తారు. సింగిల్‌ పూర్తి చేసి రెండో పరుగుకు వస్తున్న యత్నంలో అటు దీపక్‌ హుడా.. ఇటు స్టోయినిస్‌ ఇద్దరు బంతిపై దృష్టి పెట్టి తమకు తెలియకుండానే ఒక లైన్‌లో పరిగెత్తి ఎదురుపడ్డారు.

దీంతో మిడిల్‌పిచ్‌లోకి రాగానే ఇద్దరు ఒకరినొకరు గుద్దుకున్నారు. అప్పటికే బంతిని అందుకున్న టిమ్‌ డేవిడ్‌ నేరుగా ఇషాన్‌ కిషన్‌కు త్రో వేయడం.. వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ స్టోయినిస్‌ బంతిపై దృష్టి పెట్టకుండా పరుగు తీసి ఉంటే రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడేమో. 

చదవండి: ప్లేఆఫ్స్‌.. ముంబై ఇండియన్స్‌ పేరిట అరుదైన రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top