Bhuvneshwar Kumar To Lead SRH Against Rajasthan: Reports - Sakshi
Sakshi News home page

IPL 2023: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌!

Mar 30 2023 7:09 PM | Updated on Mar 31 2023 2:11 AM

Bhuvneshwar Kumar To Lead SRH  Against Rajasthan: Reports - Sakshi

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2023 సీజన్‌కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. మార్చి 31న అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ ధానాధాన్‌ లీగ్‌ ఆరంభం కానుంది.

ఇక ఇది ఇలా ఉండగా ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాళ్లు దూరం కానున్నారు.  దక్షిణాఫ్రికా, నెదర్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ నేపథ్యంలో ప్రోటీస్‌ స్టార్‌ ఆటగాళ్లు మార్‌క్రమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, రబాడ, మగాల, డికాక్‌, నోర్జే ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు.

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌
కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఐడైన్‌ మార్‌క్రమ్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి మ్యాచ్‌కు మార్‌క్రమ్‌ దూరం కానున్నాడు. ఐపీఎల్‌-2023లో ఎస్‌ఆర్‌హెచ్‌ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్‌2న హైదరాబాద్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.

ఈ మ్యాచ్‌కు మార్‌క్రమ్‌ గైర్హజరీ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా కొన్ని మ్యాచ్‌ల్లో ఆరెంజ్‌ ఆర్మీ సారథిగా భువీ వ్యవహరించాడు. అదే విధంగా గత కొన్ని సీజన్ల నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో కీలక సభ్యునిగా భువీ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఎస్‌ఆర్‌హెచ్‌ మెన్‌జెమెంట్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement