
ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో భాగంగా శుక్రవారం ఢిల్లీలో 100వ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో బెంగాల్ వారియర్స్ 45–38 పాయింట్ల స్కోరుతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. బెంగాల్ తరఫున నితిన్ కుమార్ 13 పాయింట్లతో అగ్ర స్థానాన నిలవగా, కెప్టెన్ మణీందర్ సింగ్ 11 పాయింట్లు సాధించాడు. దబంగ్ ఢిల్లీ ఆటగాళ్లలో కెప్టెన్ అషు మలిక్ 17 పాయింట్లతో చెలరేగినా... ఇతర ఆటగాళ్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు.
మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 34–30 తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. హరియాణా ఆటగాళ్ళలో వినయ్ 9 పాయింట్లు రాబట్టగా... మోహిత్ నందల్, మోహిత్ చెరో 4 పాయింట్లు సాధించారు. గుజరాత్ తరఫున ఫజల్ అత్రచి, పార్తీక్ దహియా చెరో 7 పాయింట్లు స్కోర్ చేయగా, దీపక్ సింగ్ 5 పాయింట్లు రాబట్టాడు. ఈ సీజన్‌లో 101 మ్యాచ్‌లు ముగించిన తర్వాత 71 పాయింట్లతో జైపూర్ పింక్ పాంథర్స్ అగ్రస్థానాన్ని పటిష్టపర్చుకుంది.
చదవండి: IND vs ENG: అయ్యో రజత్.. బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో! వీడియో వైరల్