ఇంగ్లండ్ క్రికెట్‌కు భారీ దెబ్బ | Ben Stokes Ruled Out Of Professional Cricket | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ క్రికెట్‌కు భారీ దెబ్బ

Mar 28 2026 6:47 PM | Updated on Mar 28 2026 7:39 PM

Ben Stokes Ruled Out Of Professional Cricket

ఇంగ్లండ్ క్రికెట్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ దేశ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కొంతకాలం​ ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న కౌంటీ సీజన్‌కు ముందు ఈ వార్త వెలువడింది. స్టోక్స్‌ కౌంటీ జట్టు (డర్హమ్‌) కోచ్‌ ర్యాన్‌ క్యాంప్‌బెల్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు.

అతని మాటల్లో.. స్టోక్స్ త్వరలో ప్రారంభం కానున్న కౌంటీ సీజన్‌కు అందుబాటులో ఉండాల్సింది. కానీ వైద్యులు అతనికి అనుమతి ఇవ్వలేదు. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు కూడా అతను అందుబాటులో ఉండవపోవచ్చు.

క్యాంప్‌బెల్‌ ఇచ్చిన ఈ సమాచారం మేరకు స్టోక్స్‌ సమీప భవిష్యత్తులో క్రికెట్‌ ఆడటం కష్టమేనని స్పష్టమవుతుంది. స్టోక్స్‌ ఇటీవల నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు బంతి ముఖానికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దీని వల్ల అతని ముఖానికి  శస్త్రచికిత్స కూడా జరిగింది. గాయమైన ముఖంతో స్టోక్స్‌ పెట్టిన పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరలైంది.

స్టోక్స్ చివరిగా జనవరి 8న సిడ్నీలో జరిగిన యాషెస్ టెస్ట్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌కు ముందు కూడా అతను గాయపడ్డాడు. వరుస గాయాలు అతని కెరీర్‌ను సందిగ్దంలో పడేశాయి. స్టోక్స్‌ వ్యక్తిగతంగా, నాయకుడిగా విఫలం కావడంతో ఇంగ్లండ్‌ ఇటీవలి యాషెస్‌ సిరీస్‌ను 1-4తో కోల్పోయింది. ఈ దారుణ పరాభవం తర్వాత కూడా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు స్టోక్స్‌ను టెస్ట్‌ కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించుకుంది. అయితే, తాజా గాయం స్టోక్స్‌ కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మర్చేసింది.

ఆటకు దూరంగా ఉన్నా, స్టోక్స్ ఇంగ్లండ్ క్రికెట్‌కు తన వంతు సహకారం అందిస్తూనే ఉన్నాడు. ఇంగ్లండ్‌ లయన్స్ జట్టుకు అతను కోచ్‌గా సేవలందిస్తున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement