ఐపీఎల్‌: ఈసారికి ఇంతే!

BCCI Approves 10 Team IPL From 2022 Edition - Sakshi

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌–2022 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 8 జట్లతో పాటు అదనంగా మరో రెండు టీమ్‌లను కొత్తగా చేర్చనుంది. దీంతో మొత్తంగా 10 జట్లు ఈ మెగాటోర్నీలో టైటిల్‌ కోసం తలపడనున్నాయి. ఈ మేరకు గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కాగా కరోనా కాలంలోనూ బీసీసీఐ, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన సంగతి తెలిసిందే. కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ క్రికెట్‌ ప్రేమికులకు కావాల్సినంత మజా అందించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ మెగాటోర్నీలో ముంబై ఇండియన్స్‌ మరోసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. (చదవండి: సెలక్షన్‌ ప్యానెల్‌; రేసులో అగార్కర్‌, మోంగియా)

ఇక గత నెలలో ఐపీఎల్‌-2020కి శుభం కార్డు పడిన నాటి నుంచి వచ్చే సీజన్‌లో 10 జట్లను ఆడిస్తారంటూ ప్రచారం జరిగిన విషయం విదితమే. అయితే  వచ్చే ఏడాది ఐపీఎల్‌కు చాలా తక్కువ సమయం ఉండటంతో టెండరింగ్‌ ప్రక్రియ, మెగా వేలం నిర్వహించడం కష్టతరమని బీసీసీఐ పెద్దలు భావించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌ చరిత్రలో 2011, 2012, 2013 మినహా ఇంతవరకు ఏ సీజన్‌లోనూ 9 కంటే ఎక్కువ జట్లు బరిలోకి దిగలేదు. ఇక 2022లో 10 జట్లు, 94 మ్యాచ్‌లతో బిగ్‌ టోర్నమెంట్‌ చూడవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఒలింపిక్స్‌(2028)లో క్రికెట్‌ను చేర్చాలన్న అంశంపై ఈ సమావేశంలో విస్త్రృత చర్చ నడుస్తున్నట్లు సమాచారం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top