Ban Vs UAE 1st T20: అఫిఫ్‌ హొసేన్‌ అద్భుత ఇన్నింగ్స్‌! తొలి టీ20లో బంగ్లా విజయం

Ban Vs UAE 1st T20: Afif Hossain Help Bangladesh Beat UAE By 7 Runs - Sakshi

United Arab Emirates vs Bangladesh, 1st T20I- Dubai: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ అఫిఫ్‌ హొసేన్‌ అదరగొట్టాడు. దుబాయ్‌ వేదికగా యూఏఈతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 55 బంతుల్లో అతడు 7 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

మిగతా ఆటగాళ్లంతా విఫలమైన వేళ విలువైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు విజయం అందించాడు. తద్వారా మొదటి టీ20లో గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0తో ముందంజలో నిలిచింది. 

అదరగొట్టిన యూఏఈ బౌలర్లు.. కానీ!
ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య యూఏఈ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. యూఏఈ బౌలర్ల ధాటికి బంగ్లా టాపార్డర్‌ కుప్పకూలింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో వచ్చిన బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అఫిఫ్‌ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి 77 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది నురుల్‌ హసన్‌ బృందం.

ఉత్కంఠ పోరులో ఆఖరికి!
ఇక లక్ష్య ఛేదనలో యూఏఈ తడబడింది. ఓపెనర్‌ చిరాగ్‌ సూరి శుభారంభం అందించినా మిగతా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆఖరల్లో కార్తిక్‌ మయప్పన్‌(12), జునైద్‌ సిద్ధిఖీ(11) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 19.4 ఓవర్లలో 151 పరుగులకు యూఏఈ ఆలౌట్‌ కావడంతో 7 పరుగుల తేడాతో విజయం బంగ్లాదేశ్‌ను వరించింది.

ఇక ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన అఫిఫ్‌ హొసేన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ దూరంగా ఉండటంతో నరుల్‌ హసన్‌ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు.

చదవండి: Rohit Sharma- Virat Kohli: పట్టరాని సంతోషం.. కోహ్లి- రోహిత్‌ ఆలింగనం.. వీడియో వైరల్‌
Ind Vs Aus 3rd T20- Rohit Sharma: పంత్‌ను అందుకే ఆడించలేదు; హైదరాబాద్‌లో మ్యాచ్‌ ప్రత్యేకం.. ఎందుకంటే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top