
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ పట్టిన ఒక క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో బంతికి ఫించ్ ఔటయ్యాడు. పాక్ బౌలర్ జహీద్ మహమూద్‌కు అదే తొలి వికెట్ కావడం విశేషం. అయితే కొద్దిలో ఈ అవకాశం సదరు బౌలర్‌కు మిస్ అయ్యేదే. ఎందుకంటే ఫించ్ ఆడిన బంతిని కీపర్ రిజ్వాన్ అందుకున్నప్పటికి గ్లౌజ్ నుంచి జారిపోయేలా కనిపించింది.
ఇక్కడే తెలివి ప్రదర్శించిన కీపర్ మహ్మద్ రిజ్వాన్ డైవ్ చేస్తూ బంతి పట్టు జారకుండా పట్టుకున్నాడు. అలా జహీద్ ఖాతాలో తొలి వికెట్ పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 38 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ 3, అలెక్స్ క్యారీ క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ ట్రెవిస్ హెడ్ 101 పరుగులతో రాణించగా.. బెన్ మెక్‌డెర్మోట్ 55 పరుగులు చేసి వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ మార్క్‌ను సాధించాడు. మరో 12 ఓవర్లు మిగిలి ఉండడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరుపై కన్నేసింది.
చదవండి: Kraigg Brathwaite: అత్యధిక టెస్టు వికెట్లతో విండీస్ కెప్టెన్ కొత్త రికార్డు?!
IPL 2022: "రాహుల్ చేసిన అతి పెద్ద తప్పు అదే.. అందుకే లక్నో ఓడిపోయింది"