PAK Vs NED 3rd ODI: Babar Azam Calls Scotland Instead-Of Netherlands Gets Trolled By Fans - Sakshi
Sakshi News home page

Babar Azam: చిన్న జట్టంటే అంత చులకన.. ఏ దేశంతో ఆడుతున్నారో తెలియదా!

Aug 23 2022 7:20 AM | Updated on Aug 23 2022 8:33 AM

Babar Azam Calls Scotland Instead-Of Netherlands Gets Trolled By Fans - Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను క్రికెట్‌ అభిమానులు దారుణంగా ట్రోల్‌ చేశారు. కనీసం ఏ జట్టుతో ఆడుతున్నామనే విషయాన్ని కూడా మరిచిపోతే ఎలా అని.. చిన్న జట్టంటే అంత చులకన.. అంటూ ఫ్యాన్స్‌ ఏకిపారేశారు. విషయంలోకి వెళితే.. పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరిగింది. ఈ సిరీస్‌ను పాకిస్తాన్‌ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో పాకిస్తాన్‌ తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 49.2 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో 9 పరుగుల తేడాతో గెలిచి పాక్‌ ఊపిరి పీల్చుకుంది.

ఈ సంగతి పక్కనబెడితే.. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కెప్టెన్‌ బాబర్‌ ఆజం.. మాటల మధ్యలో తాము ఆడుతున్నది నెదర్లాండ్స్‌తో అన్న సంగతి మరిచిపోయి ''స్కాట్లాండ్‌'' అని పలికాడు. ''మమ్మల్ని కట్టడి చేసిన స్కాట్లాండ్ బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే'' అంటూ కామెంట్ చేశాడు. అంతే పాకిస్తాన్‌ సిరీస్‌ గెలిచిందన్న విషయం మరిచిపోయి మరీ బాబర్‌ ఆజంను ట్రోల్‌ చేశారు క్రికెట్‌ అభిమానులు.

''బాబర్‌ ఆజం..  స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఓమన్, యూఏఈ, జింబాబ్వే వంటి అసోసియేట్ దేశాలపై క్రికెట్ ఆడుతూ రికార్డులు నమోదు చేస్తున్నాడు. నెదర్లాండ్స్‌కి బదులుగా స్కాట్లాండ్‌ అనడంలో తప్పు లేదని.. ఏ ఆస్ట్రేలియాతో ఆడుతూనో, ఇంగ్లండ్ బౌలర్లనో అని ఉంటే ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోవాల్సి వచ్చేదని కామెంట్‌ చేశారు. బాబర్‌ ఆజంకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement