యూఏఈ టీ20 లీగ్‌లో అజం ఖాన్‌.. తొలి పాక్‌ ఆటగాడిగా!

Azam Khan becomes first Pakistan player to join UAEs ILT20 - Sakshi

యూఏఈ టీ20 లీగ్ తొలి సీజన్‌ కోసం డెసర్ట్ వైపర్స్ ప్రాంఛైజీ పాకిస్తాన్‌ ఆటగాడు అజం ఖాన్‌తో ఓప్పందం కుదుర్చుకుంది. తద్వారా యూఏఈ టీ20 లీగ్ అడుగుపెట్టిన తొలి పాక్‌ ఆటగాడిగా అజం ఖాన్‌ నిలిచాడు. కాగా టోర్నీ కోసం డెసర్ట్ వైపర్స్ తమ విదేశీ ఆటగాళ్ల జాబితాను శనివారం ప్రకటించింది. శ్రీలంక స్పిన్నర్‌ వానిందు హసరంగా, న్యూజిలాండ్‌ ఓపెనర్‌ కొలిన్‌ మున్రో వంటి స్టార్‌ ఆటగాళ్లను  డెసర్ట్ వైపర్స్ తమ జట్టులోకి చేర్చుకుంది.

డెసర్ట్ వైపర్స్‌ హెడ్‌ కోచ్‌గా జేమ్స్ ఫోస్టర్‌
మరో వైపు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ తమ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా డెసర్ట్ వైపర్స్ నియమించింది. అదే విధంగా ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌  జేమ్స్ ఫోస్టర్‌ తమ జట్టు ప్రధాన కోచ్‌గా  డెసర్ట్ వైపర్స్ ఎంపిక చేసింది. కాగా డెసర్ట్ వైపర్స్ ప్రాంఛైజీని లాన్సర్ క్యాపిటల్ సంస్థ కొనుగోలు చేసింది.

ఇక ఈ లీగ్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వాటిలో ఐదు జట్లును ఐపీఎల్‌ ప్రాంఛైజీలే దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇప్పటికే దుబాయ్‌ క్యాపిటల్స్‌,ముంబై  ఎమిరేట్స్,షార్జా వారియర్స్ తాము ఒప్పందం కుదుర్చుకున్న జాబితాను విడుదల చేశాయి.
చదవండి:  Asia Cup 2022: కెప్టెన్‌గా షనక.. ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top