స్వతంత్ర భారతి1988/2022

Azadi Ka Amrit Mahotsav:Viswanathan Anand First Grand Master Of India - Sakshi

తొలి గ్రాండ్‌ మాస్టర్‌

భారతదేశపు తొలి గ్రాండ్‌ మాస్టర్‌గా మద్రాసుకు చెందిన విశ్వనాథన్‌ ఆనంద్‌ అవతరించారు. అప్పటికి ఆయన వయసు 18. ఆ ముందు ఏడాదే ఆనంద్, భారతదేశపు తొలి ‘వరల్డ్‌ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌’ అయ్యారు. గ్రాండ్‌ మాస్టర్‌ పోటీలు కోయంబత్తూరులో జరిగాయి. ‘సాక్షి ఫైనాన్స్‌’ ఆ ఇంటర్నేషనల్‌ చెస్‌ టోర్నమెంట్‌ పోటీలను నిర్వహించింది. ఆ టోర్నమెంట్‌లో రష్యన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ఎఫిమ్‌ గెల్లర్‌ మీద ఆనంద్‌ విజయం సాధించడం విశేషం. ఆనాటి నుంచే భారతదేశంలో చెస్‌కు ఒక గుర్తింపు వచ్చింది. ప్రపంచ చెస్‌లో భారతదేశానికీ ఒక గుర్తింపు వచ్చింది. 

ఇదే ఏడాదికి మరికొన్ని పరిణామాలు

– ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. 
– జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఏర్పడింది. 
– ఖాతాదారుల క్రెడిట్‌ రికార్డును అనుసరించి ఛార్జీలు విధించే 
 -వెసులుబాటు బ్యాంకులకు లభించింది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top