జొకోవిచ్‌ శుభారంభం.. సిట్సిపాస్‌పై వరుసగా తొమ్మిదో విజయం | ATP Finals: Djokovic Beat tsitsipas In Red Group Match | Sakshi
Sakshi News home page

ATP Finals: జొకోవిచ్‌ శుభారంభం.. సిట్సిపాస్‌పై వరుసగా తొమ్మిదో విజయం

Nov 16 2022 8:10 AM | Updated on Nov 16 2022 8:10 AM

ATP Finals: Djokovic Beat tsitsipas In Red Group Match - Sakshi

పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌ శుభారంభం చేశాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో ‘రెడ్‌ గ్రూప్‌’ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 6–4, 7–6 (7/4)తో మూడో ర్యాంకర్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై గెలిచాడు. సిట్సిపాస్‌పై జొకోవిచ్‌కిది వరుసగా తొమ్మిదో విజయం. ‘గ్రీన్‌ గ్రూప్‌’ మ్యాచ్‌లో స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ 3–6, 4–6తో ఫెలిక్స్‌ అలియాసిమ్‌ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. ఇదే గ్రూప్‌లో టేలర్‌ ఫ్రిట్జ్‌ తదుపరి మ్యాచ్‌లో గెలిస్తే నాదల్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement