#ArshdeepSingh: జాగ్రత్త..  అక్కడ వికెట్లు విరిగిపోతున్నాయ్‌! | Arshdeep Singh Breaks Middle Stump Wicket-Two Pieces-Two Times Vs MI | Sakshi
Sakshi News home page

#ArshdeepSingh: జాగ్రత్త..  అక్కడ వికెట్లు విరిగిపోతున్నాయ్‌!

Apr 22 2023 11:36 PM | Updated on Apr 23 2023 6:03 AM

Arshdeep Singh Breaks Middle Stump Wicket-Two Pieces-Two Times Vs MI - Sakshi

Photo: IPL Twitter

పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ భయంకరమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. అతని బౌలింగ్‌లో ఉన్న స్పీడు దాటికి వికెట్లు కూడా విరిగిపోతున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ వేగానికి రెండుసార్లు అంపైర్లు కొత్త వికెట్లు తేవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ అర్ష్‌దీప్‌ వేశాడు.

ముంబై విజయానికి ఆరు బంతుల్లో 16 పరుగులు కావాలి.. అయితే ఒత్తిడిలోనూ అర్ష్‌దీప్‌ సూపర్‌గా బౌలింగ్‌ వేశాడు. ఓవర్‌ మూడో బంతికి తిలక్‌ వర్మను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అతని బౌలింగ్‌ వేగం దాటికి మిడిల్‌ స్టంప్‌ ఎగిరి రెండు ముక్కలయింది. దీంతో అంపైర్‌ కొత్త స్టంప్‌ పెట్టాడు.

అయితే ఆ తర్వాతి బంతికే అర్ష్‌దీప్‌ నెహాల్‌ వదేరాను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో మరోసారి మిడిల్‌ స్టంప్‌ ఎగిరి రెండు ముక్కలయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు వామ్మో.. అర్ష్‌దీప్‌తో జాగ్రత్తగా ఉండండి.. అక్కడ వికెట్లు విరిగిపోతున్నాయ్‌. అంటూ కామెంట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement