భారత 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అరోణ్యక్‌ ఘోష్‌ | Aronyak Ghosh became India 95th Grandmaster | Sakshi
Sakshi News home page

భారత 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అరోణ్యక్‌ ఘోష్‌

Apr 21 2026 5:29 AM | Updated on Apr 21 2026 6:12 AM

Aronyak Ghosh became India 95th Grandmaster

రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగాల్‌కు చెందిన యువ చెస్‌ ప్లేయర్‌ అరోణ్యక్‌ ఘోష్‌ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా సంపాదించాడు. బ్యాంకాక్‌ చెస్‌ క్లబ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో 22 ఏళ్ల ఈ కోల్‌కతా ప్లేయర్‌ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో నార్మ్‌ను సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అరోణ్యక్‌ ఏడు పాయింట్లు స్కోరు చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. 

2023లో సాంట్స్‌ ఓపెన్‌లో తొలి జీఎం నార్మ్‌ పొందిన అరోణ్యక్‌... 2024లో అనెమాస్‌ మాస్టర్స్‌ టోర్నీలో రెండో జీఎం నార్మ్‌ దక్కించుకున్నాడు. ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో జాతీయ చాంపియన్‌గా ఉన్న అరోణ్యక్‌ గత ఏడాది ప్రపంచకప్‌ టోరీ్నకి అర్హత సాధించాడు. తొలి రౌండ్‌లో మటెసుజ్‌ బార్టెల్‌ (పోలాండ్‌)ను ఓడించిన అతను రెండో రౌండ్‌లో లెవోన్‌ అరోనియన్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 401వ ర్యాంక్‌లో ఉన్న అరోణ్యక్‌ ఖాతాలో 2533 ఎలో రేటింగ్‌ పాయింట్లున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement