 
													వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత్-న్యూజిలాండ్ తలపడతున్నాయి. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా దూకుడుగా ఆడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
కేవవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ ఔటైనప్పటికీ గిల్ మాత్రం తన జోరును కొనసాగిస్తున్నాడు. 41 బంతుల్లో గిల్ తన 13వ వన్డే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 22 ఓవర్లకు టీమిండియా వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో గిల్(78), కోహ్లి(29) పరుగులతో ఉన్నారు.
టెన్షన్ పడిన అనుష్క..
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఔటైన తర్వాత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో విరాట్ విరాట్ అంటూ స్టేడియం హోరెత్తిపోయింది. అయితే కోహ్లి ఎదుర్కొన్న బంతినే కివీస్ ఆటగాళ్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. 8  ఓవర్‌లో టిమ్ సౌథీ వేసిన నాలుగో బంతిని విరాట్  డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని ప్యాడ్‌కు తాకుతూ థర్డ్‌మ్యాన్ దిశగా బౌండరీకి వెళ్లింది.
కానీ సౌథీతో పాటు కివీస్ ప్లేయర్స్ ఎల్బీకు గట్టిగా అప్పీలు చేశారు. అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. అయితే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్ కీపర్ లాథమ్ సూచనతో రివ్యూకు వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. రివ్యూలో ఫలితం ఏమి తేలుతుందో అని స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు, టీవీలు ముందు కూర్చున్న క్రికెట్‌ప్రేమికులు ఊపిరిబిగపట్టి మరి ఎదురు చూశారు.
ఈ క్రమంలో స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న విరాట్ సతీమణి అనుష్క శర్మ సైతం తెగ టెన్షన్ పడింది. అయితే రిప్లేలో బంతి క్లియర్‌గా బ్యాట్‌కు తాకినట్లు తేలడంతో  అనుష్క ఒక్కసారిగా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
చదవండి: CWC 2023- Rohit Sharma: రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర.. ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
People blamed Anushka as bad luck for Virat,today she is the lucky charm,Virat will hit century 💙❤️ pic.twitter.com/S5eFQloGXC
— HariKrish (@krishtweets_HK) November 15, 2023

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
