జ‌స్ప్రీత్ బుమ్రాకు ఏమైంది? | Another injury concern for Jasprit Bumrah? Mumbai Indians pacer checks into BCCI CoE before IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: జ‌స్ప్రీత్ బుమ్రాకు ఏమైంది?

Mar 23 2026 7:49 PM | Updated on Mar 23 2026 9:25 PM

Another injury concern for Jasprit Bumrah? Mumbai Indians pacer checks into BCCI CoE before IPL 2026

ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముందు భారత పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడా? అంటే అవునానే  సమాధానం ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ఇంకా కేవలం ఐదు రోజులు మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికి బుమ్రా ఇంకా ముంబై ఇండియ‌న్స్ శిబిరంలో చేర‌లేదు.

టైమ్స్ ఆఫ్ ఇండియా క‌థ‌నం ప్ర‌కారం.. బుమ్రా ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.  సాధారణంగా ఆటగాళ్లు గాయపడినప్పుడు లేదా ఫిట్‌నెస్ పరీక్షల కోసం మాత్ర‌మే బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌కు వెళ్తారు. కానీ బుమ్రా ఇప్పుడు సీఓఈకు ఏదైనా గాయం వల్ల లేదా సాధారణ చెకప్ కోసమా వెళ్లాడా అన్న‌ది ఇంకా స్ప‌ష్ట‌త లేదు.

ముంబై ఇండియ‌న్స్ నుంచి కూడా ఎటువంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ మ‌హేల జ‌య‌వ‌ర్ద‌నే ఇటీవ‌ల మాట్లాడుతూ.. ప్రపంచ కప్ ఆడిన ఆటగాళ్లందరికీ తగినంత విరామం ఇచ్చామని, వారందరూ మార్చి 22 నాటికి జట్టుతో చేరుతారని చెప్పాడు.

కానీ బుమ్రా మాత్రం ఇంకా ప్రాక్టీస్ సెషన్లకు హాజరుకాలేదు. ప్ర‌స్తుతం ఇదే విష‌యం క్రికెట్ వ‌ర్గాల్లో చర్చానీయాంశ‌మైంది. ఈ టోర్నీలో ముంబై ఇండియ‌న్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న వాంఖ‌డే వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌ న్యూస్‌.. యార్కర్ల కింగ్‌ వచ్చేస్తున్నాడు

Advertisement
 
Advertisement
Advertisement