ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఎషాన్ మలింగ తన ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో ఆడేందుకు అతడికి శ్రీలంక క్రికెట్ 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) మంజూరు చేసింది.
మలింగ ఒకట్రెండు రోజుల్లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టుతో కలవనున్నాడు. మలింగకు ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడ్డాడు. దీంతో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 19వ సీజన్ కూడా దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. గత వారం శ్రీలంక క్రికెట్ నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలలో దుష్మంత చమీర, పాతుమ్ నిస్సంక, కమిందు మెండిస్ ఉత్తీర్ణత సాధించినప్పటికి.. మలింగ మాత్రం క్లియర్ చేయలేకపోయాడు.
దీంతో అతడు టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని అంతా భావించారు. కానీ తాజాగా నిర్వహించిన పరీక్షలలో మాత్రం అతడు పాసయ్యాడు. మలింగ రాకతో సన్‌రైజర్స్ బౌలింగ్ పటిష్టంగా మారనుంది. మలింగ గత సీజన్‌లో కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు తీసి సత్తాచాటాడు. తన యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇప్పుడు ప్యాట్ కమ్మిన్స్ లేని లోటును మలింగ భర్తీ చేయనున్నాడు.
మలింగ వెన్ను గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు వనిందు హసరంగ (లక్నో సూపర్ జెయింట్స్), మతీష పతిరణ (కోల్‌కతా నైట్ రైడర్స్), నువాన్ తుషార (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఇంకా ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: PSL 2026: చంపేస్తమంటూ వార్నింగ్.. అయినా పాక్‌కు వచ్చిన స్మిత్


