చంపేస్త‌మంటూ వార్నింగ్‌.. అయినా పాక్‌కు వ‌చ్చిన స్మిత్‌ | Steve Smith Arrives In Pakistan For PSL Amid Tensions Over Threat From Armed Group | Sakshi
Sakshi News home page

PSL 2026: చంపేస్త‌మంటూ వార్నింగ్‌.. అయినా పాక్‌కు వ‌చ్చిన స్మిత్‌

Mar 23 2026 5:25 PM | Updated on Mar 23 2026 5:31 PM

Steve Smith Arrives In Pakistan For PSL Amid Tensions Over Threat From Armed Group

ఆస్ట్రేలియా స్టార్ క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026లో ఆడేందుకు ల‌హోర్‌కు చేరుకున్నాడు. ఓ వైపు పాకిస్థాన్‌ వ్యతిరేక సాయుధ దళం జమాత్‌ ఉల్‌ అహ్రార్‌ నుంచి బెదిరింపులు వ‌చ్చిన‌ప్ప‌టికి.. స్మిత్ మాత్రం పాక్ గ‌డ్డ‌పై అడుగుపెట్టాడు. ల‌హోర్ ఎయిర్‌పోర్ట్‌లో స్మిత్‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య అత‌డు ముల్తాన్ సుల్తాన్ టీమ్ బ‌స చేసే హోట‌ల్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతున్నాయి.

చంపేస్త‌మంటూ వార్నింగ్‌!
కాగా నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP)కి చెందిన జమాత్-ఉల్-అహ్రార్ విభాగం విదేశీ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేసింది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్ వంటి ఆటగాళ్లు వెంటనే టోర్నీ నుండి తప్పుకోవాలని, లేదంటే వారి భద్రతకు తాము బాధ్యులం కాదని ఓ ప్ర‌క‌ట‌న‌లో జమాత్-ఉల్-అహ్రార్ పేర్కొంది. అయిన‌ప్ప‌టికి విదేశీ ఆట‌గాళ్లు ఒక్కొక్క‌రుగా పాక్‌కు చేరుకుంటున్నారు.

పీసీబీ కీల‌క నిర్ణ‌యం..
ఈ హెచ్చరిక‌ల‌ నేప‌థ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భద్రత, ఇంధన సంక్షోభం దృష్ట్యా ఈసారి మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అంతేకాకుండా కేవ‌లం రెండు వేదిక‌ల‌లో ఈ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక పీఎస్ఎల్ 11వ సీజ‌న్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: ICC: పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement