పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు | Sahibzada Farhan and Arundhati Reddy win ICC Player of the Month for February | Sakshi
Sakshi News home page

ICC: పాక్ ఆటగాడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు

Mar 23 2026 2:57 PM | Updated on Mar 23 2026 5:34 PM

Sahibzada Farhan and Arundhati Reddy win ICC Player of the Month for February

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన పాకిస్తాన్ యువ ఓపెన‌ర్ సాహిబ్జాదా ఫర్హాన్‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఫిబ్రవరి నెలకు గానూ ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా ఫర్హాన్ ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ విల్ జాక్స్‌, అమెరికా పేస‌ర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్‌లను వెనక్కి నెట్టి ఫర్హాన్ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సెమీస్‌కు చేరడంలో విఫలమైనప్పటికి.. సాహిబ్జాదా ఫర్హాన్ మాత్రం దుమ్ములేపాడు. ఒక్క భారత్‌పై తప్ప ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు బ్యాట్ ఝులిపించాడు. నమీబియా, శ్రీలంకపై సెంచరీలతో అతడు చెలరేగాడు.

తద్వారా ఒకే టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 383 పరుగులు సాధించి, ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లిని అతడు అధిగమించాడు. ఈ క్రమంలోనే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.

ఫర్హాన్ కంటే ముందు బాబర్ ఆజం,  ఫఖర్ జమాన్, నోమన్ అలీ, హసన్ అలీ వంటి పాక్ ఆటగాళ్లు ఈ ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నారు. బాబర్‌కు అయితే అత్యధికంగా మూడు సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. 

ఇక మహిళల విభాగంగాలో భారత స్టార్ ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డి ఈ అవార్డు వరించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అరుంధతి మొత్తం 8 వికెట్లు పడగొట్టింది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో అరుంధతిది కీలక పాత్ర.
చదవండి: వైభవ్‌పై డివిలియర్స్‌ ప్రశంసలు!.. ఆర్సీబీ స్టార్‌ షాకింగ్‌ కామెంట్స్‌
 

Advertisement
 
Advertisement
Advertisement