ఆంధ్రను గెలిపించిన భరత్, అశ్విన్‌  | Andhra teams second win in a row | Sakshi
Sakshi News home page

ఆంధ్రను గెలిపించిన భరత్, అశ్విన్‌ 

Oct 23 2023 4:10 AM | Updated on Oct 23 2023 4:10 AM

Andhra teams second win in a row - Sakshi

రాంచీ: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు ఖాతాలో వరుసగా రెండో విజయం చేరింది. గుజరాత్‌ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ 19.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఆర్య దేశాయ్‌ (35 బంతుల్లో 62 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీ చేశాడు.

ఆంధ్ర బౌలర్లు స్టీఫెన్‌ (3/25), కావూరి సాయితేజ (2/45), కేవీ శశికాంత్‌ (2/22), మనీశ్‌ (2/47) గుజరాత్‌ జట్టును దెబ్బ తీశారు. అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 17.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెపె్టన్‌ కోన శ్రీకర్‌భరత్‌ (41 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అశి్వన్‌ హెబ్బర్‌ (36 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 10.2 ఓవర్లలో 87 పరుగులు జోడించారు.

వీరిద్దరు అవుటయ్యాక విహారి (16 బంతుల్లో 24 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రికీ భుయ్‌ (13 బంతుల్లో 26 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆంధ్ర జట్టును విజయతీరానికి చేర్చారు. నేడు జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో మణిపూర్‌ జట్టుతో ఆంధ్ర ఆడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement