
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వాంఖడే వేదికగా శనివారం(మార్చి26) జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభం కానుంది. అయితే కోల్‌కతాకు విదేశీ స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారు. తొలి మ్యాచ్‌కు పాట్ కమ్మిన్స్, ఆరోన్ ఫించ్ దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్కేతో తలపడే కేకేఆర్ తుది జట్టును భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా అంచనా వేశాడు.
ఓపెనర్లుగా అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్‌లను ఎంచుకున్నాడు. మూడు, నాలుగు స్థానాల్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణాకు చోటు ఇచ్చాడు. ఇక వికెట్ కీపర్‌గా సామ్ బిల్లింగ్స్‌ను అవకాశం ఇచ్చాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో రస్సెల్, సునీల్ నరైన్, చమికా కరుణరత్నేను ఎంచుకున్నాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివం మావిని ఆకాష్ చోప్రా చేశాడు. కాగా న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌథీను ఎంపిక చేయకపోవడం గమనార్హం.
ఆకాష్ చోప్రా అంచానా వేసిన కేకేఆర్ జట్టు: వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, చమిక కరుణరత్నే, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి
చదవండి: PAK vs AUS: పాకిస్తాన్‌తో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్!