
తొడ కండరాల గాయంతో ఆటకు దూరమైన భారత క్రికెటర్ అజింక్య రహానే 6–8 వారాల్లోగా కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున ఆడుతూ రహానే గాయపడ్డాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పది రోజుల పాటు తన రీహాబిలిటేషన్ జరిగిందని, గాయం తీవ్రత ప్రస్తుతం తగ్గిందని అతను అన్నాడు. రహానే సారథ్యంలో ఆస్ట్రేలియాపై సాధించిన గత టెస్టు సిరీస్ విజయంపై రూపొందించిన డాక్యుమెంటరీలో తన మెల్‌బోర్న్ టెస్టు సెంచరీని అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు.