#AjinkyaRahane: రీఎంట్రీలో ఆపద్భాందవుడి పాత్ర.. భారత్‌ తరపున తొలి బ్యాటర్‌గా

Ajinkya Rahane-Become-1st-Indian Batter To Register Fifty-In-WTC Final - Sakshi

టీమిండియా స్టార్‌ అజింక్యా రహానే టెస్టు పునరాగమనం ఘనంగా చాటుకున్నాడు. దాదాపు 512 రోజుల తర్వాత నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ద్వారా టెస్టు ఆడుతున్న రహానే అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కష్టకాలం ఎదుర్కొంటున్న సమయంలో రహానే ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తూ సూపర్‌ ఫిఫ్టీతో మెరిశాడు.

ఆసీస్‌ పేసర్ల దాటికి బ్యాటింగ్‌ చేయడానికి ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో రహానే 92 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ సాధించాడు. రహానే టెస్టు కెరీర్‌లో ఇది 26వ అర్థశతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే అజింక్యా రహానే టీమిండియా తరపున డబ్ల్యూటీసీ ఫైనల్లో అర్థసెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

2021లో టీమిండియా కివీస్‌తో తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడినప్పటికి ఆ మ్యాచ్‌లో ఒక్క భారత్‌ బ్యాటర్‌ కూడా హాఫ్‌ సెంచరీ అందుకోలేకపోయాడు. అప్పటి మ్యాచ్‌లోనూ రహానే 49 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవడం విశేషం. తాజాగా ఆసీసీతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ కుదేలైనప్పటికి రహానే ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తూ టీమిండియాను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇటీవలే ఐపీఎల్‌ సీఎస్‌కే తరపున అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రహానే అదే ఫామ్‌ను ఇక్కడా కంటిన్యూ చేయడం సంతోషదాయకం.  టి20ల్లో తన వేగవంతమైన ఆటతో అలరించిన రహానే టెస్టులకు వచ్చేసరికి తనలోని టెస్టు స్పెషలిస్ట్‌ను బయటికి తీశాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top