మెరిసిన మ్యాక్స్‌వెల్, అగర్‌ | Agar scalps six as Australia beats New Zealand in third T20 | Sakshi
Sakshi News home page

మెరిసిన మ్యాక్స్‌వెల్, అగర్‌

Mar 4 2021 6:25 AM | Updated on Mar 4 2021 6:25 AM

Agar scalps six as Australia beats New Zealand in third T20 - Sakshi

వెల్లింగ్టన్‌: బ్యాట్‌తో మ్యాక్స్‌వెల్‌ (31 బంతుల్లో 70; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు... బంతితో యాష్టన్‌ అగర్‌ (6/30) మాయాజాలం... వెరసి న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగులతో తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఆరోన్‌ ఫించ్‌ (44 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అర్ధ సెంచరీ చేశాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ అగర్‌ స్పిన్‌ వలలో చిక్కుకొని 17.1 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. గప్టిల్‌ (43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కాన్వే (38; 5 ఫోర్లు, సిక్స్‌) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా (అజంతా మెండిస్, యజువేంద్ర చహల్‌ రెండుసార్లు చొప్పున తీశారు), ఆసీస్‌ నుంచి తొలి బౌలర్‌గా అగర్‌ గుర్తింపు పొందాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 2–1తో ఆధిక్యంలో ఉండగా... నాలుగో టి20 శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement