భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా సుమారివాలా | Sakshi
Sakshi News home page

Adille Sumariwalla: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా సుమారివాలా

Published Sun, Aug 28 2022 4:46 PM

AFI President Adille Sumariwalla Appointed As Interim President Of Indian Olympic Association - Sakshi

Adille Sumariwalla Appointed As Interim President Of Indian Olympic Association: భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు, మాజీ ఒలింపియన్ ఆదిల్ సుమారివాలా ఎన్నికయ్యారు. వ్యక్తిగత కారణాల చేత మాజీ అధ్యక్షుడు నరిందర్‌ బత్రా రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని సుమారివాలా భర్తీ చేయనున్నారు. ఎన్నికలు జరిగే వరకు సుమారివాలా ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ఐవోఏ తెలిపింది.

ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో మెజారిటీ సభ్యులు సుమారివాలా అభ్యర్ధిత్వానికి మద్దతు తెలపడంతో ఈ నియామకం జరిగినట్లు ఐవోఏ వెల్లడించింది. కాగా, భారత ఒలింపిక్ సంఘం చరిత్రలో ఓ ఒలింపియన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆదిల్ సుమారివాలా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున  అథ్లెటిక్స్‌లో (100 మీటర్ల రన్నింగ్‌) ప్రాతినిధ్యం వహించాడు.  
చదవండి: భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత
 

Advertisement
Advertisement