డివిలియర్స్‌ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడాడు.. అతడి కంటే రైనా చాలా బెటర్‌!

AB de Villiers only had personal records in the IPL - Sakshi

దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబీ డివిలియర్స్‌కు భారత్‌లో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌ ద్వారా ఎంతో మంది అభిమానులను డివిలియర్స్‌ సంపాందించుకున్నాడు. తన విధ్వంసకర ఆట తీరుతో అభిమానులను మంత్రముగ్ధులను చేసేవాడు. ఫ్యాన్స్‌ అతడిని ముద్దుగా మిస్టర్‌ 360 అని పిలుచుకుంటారు.

అదే విధంగా తన సొంత దేశం దక్షిణాఫ్రికా తర్వాత ఇష్టమైనది ఇండియానే అని చాలా సందర్భాల్లో ఏబీడీ కూడా తెలిపాడు.  అటువంటి డివిలియర్స్‌పై భారత మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ వివాదాస్పద వాఖ్యలు చేశాడు. డివిలియర్స్‌ కేవలం వ్యక్తిగత రికార్డుల కోసం మాత్రమే ఆడాడని సంచలన కామెంట్స్‌ చేశాడు.

"చిన్నస్వామి స్టేడియం లాంటి చిన్న మైదానంలో ఎబీ డివిలియర్స్ దాదాపు 8 నుంచి 10 ఏళ్ల పాటు ఆడాడు. అటువంటి ఏ ఆటగాడికైనా స్ట్రైక్ రేటు ఎక్కువగానే ఉంటుంది. ఐపీఎల్‌లో డివిలియర్స్ కంటే సురేష్‌ రైనా అద్భుతమైన ఆటగాడు. అతడు వ్యక్తిగత రికార్డులతో పాటు నాలుగు ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచిన జట్టులోనూ భాగంగా ఉన్నాడు.

కానీ డివిలియర్స్ మాత్రం కేవలం వ్యక్తిగత రికార్డులు మాత్రమే కలిగి ఉన్నాడు" అని స్టార్‌ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్‌ పేర్కొన్నాడు. ఇక వివాదాస్పద వాఖ్యలు చేసిన గంభీర్‌పై ఏబీడీ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇక తన ఐపీఎల్‌ కెరీర్‌లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ 5162 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలతో పాటు 40 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: WPL 2023 MI VS GG: క్రికెట్‌ చరిత్రలో తొలిసారి.. కొత్త రూల్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన హర్మన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top