IND vs BAN: టీ20లు కాదు.. వన్డేలపై దృష్టి పెట్టండి! ఐపీఎల్‌ ఆడడం మానేయండి

Aakash Chopra urges Indian players to play all ODIs ahead of 2023 WC - Sakshi

బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లపై భారత మాజీ ఓపెనర్‌ ఆకాష్‌ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భారత ఆటగాళ్లందరూ టీ20 క్రికెట్‌పై కాకుండా వన్డే ఫార్మాట్‌పై  దృష్టి సారించాలని  చోప్రా సూచించాడు. ఇక సిరీస్‌ను చేజార్చుకున్న భారత్‌.. బంగ్లాదేశ్‌తో ఆఖరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలబెట్టు కోవాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే ఛాటోగ్రమ్‌ వేదికగా శనివారం జరగనుంది.

ఈ నేపథ్యంలో ఆకాష్‌ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. "భారత ఆటగాళ్లు తరచూ విశ్రాంతి తీసుకోవడం మనం చూస్తున్నాం. గత ఏడాది నుంచి చాలా మంది స్టార్‌ ఆటగాళ్లు పలు వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్నారు. మీకు విశ్రాంతి కావాలంటే ఐపీఎల్‌ లేదా టీ20 సిరీస్‌లలో విశ్రాంతి తీసుకోండి. కానీ వన్డే క్రికెట్‌లో మాత్రం జట్టుకు అందుబాటులో ఉండండి.

ఎందుకంటే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. ఐపీఎల్‌ వరకు భారత జట్టు దాదాపు 10 వన్డేలు ఆడనుంది. కాబట్టి ఈ మొత్తం వన్డేల్లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ ఆడాలి. అప్పడే  ప్రపంచకప్‌లో పోటీ పడగలరు. ఇక ఆటగాళ్లకు ఎక్కువగా విశ్రాంతిని ఇవ్వడం మన జట్టులోనే కాదు ప్రపంచ క్రికెట్‌లో చాలా జట్లు అలానే చేస్తున్నాయి. అది సరైన నిర్ణయం కాదు.

ఆటగాళ్లు ఎక్కువగా క్రికెట్‌ ఆడకపోతే వాళ్లకి ప్రాక్టీస్‌ ఎలా అవుతుంది. ఆస్ట్రేలియా జట్టు కూడా ఇదే తప్పు చేసింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు అలసట పేరిట చాలా మంది ఆటగాళ్లకు రెస్టు ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది మెగా టోర్నీలో ఆసీస్‌ కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరలేకపోయింది" అని అతడు పేర్కొన్నాడు.
చదవండిఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం.. జింబాబ్వే తరపున ఆడేందుకు!

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top