మౌలానా ఆజాద్‌ మార్గంలో పయనిద్దాం | - | Sakshi
Sakshi News home page

మౌలానా ఆజాద్‌ మార్గంలో పయనిద్దాం

Nov 12 2026 11:36 AM | Updated on Nov 12 2026 11:36 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): భారత స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చూపిన మార్గంలో పయనిద్దామని జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో మైనార్టీస్‌ వెల్ఫే ర్‌ డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీకిరణ్‌ మాట్లాడుతూ...మౌలానా ఆజాద్‌ దేశ విద్యారంగానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. జాతీయ సమైక్యతకు, మత సామరస్యం, మైనార్టీల సంక్షేమం కోసం ఆజాద్‌ చూపిన మార్గం ఆచరణీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement