● వందేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు రీ–సర్వే
● కలెక్టర్ హైమావతి
గజ్వేల్: భూభారతి రీ–సర్వే కార్యక్రమంతో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కారం కానున్నాయని కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం జగదేవ్‌పూర్ మండలం గోపాల్‌పూర్‌లో భూభారతి రీ–సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందేళ్ల కిందట జరిగిన భూ సర్వే ప్రస్తుతం జరుగుతున్నదని చెప్పారు. ముందుగా చిన్న గ్రామా లను ఎంపిక చేసుకొని, రీ–సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. గోపాల్‌పూర్‌లో 399 ఎకరాల భూము లు ఉన్నాయని వివరించారు. ముందుగా గ్రామ సరిహద్దు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నక్ష బాటలు సర్వే చేశాక పట్టా భూముల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే సందర్భంలో ఎలాంటి అనుమానాలున్నా రైతులు వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. అభ్యంతరాలుంటే అధికారులకు తెలియజేయాలన్నారు. భూ యజమానులకు ఒకే చోట పలు సర్వేనంబర్లలో భూములు ఉన్నట్లయితే భూభారతి చట్టంలో సదరు యజమానికి ఒకే సర్వేనంబర్‌ను కేటాయించనున్నారన్నారు. రీ–సర్వేకు రైతులు సహకరించాలని కోరారు.


