మాలల జేఏసీ చైర్మన్ లక్ష్మణ్
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు
దుబ్బాకటౌన్: మాల నిరుద్యోగులకు, ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న రోస్టర్ పాయింట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరించి మాలలకు న్యాయం చేయాలని జిల్లా మాల జేఏసీ చైర్మన్ ఆస లక్ష్మణ్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. దుబ్బాక పట్టణంలో మాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో జరిగే నియోజకవర్గ మాలల సదస్సు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీల జనాభా లెక్కల సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసి వర్గీకరణ చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశానికి భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆస స్వామి, కాల్వ లింగం, తౌడ శ్రీనివాస్, బత్తుల స్వామి, రాజశేఖర్ తదితరులున్నారు.


