అడ్వెంచర్‌ క్యాంపునకు గురుకుల విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

అడ్వెంచర్‌ క్యాంపునకు గురుకుల విద్యార్థిని

Nov 5 2026 8:50 AM | Updated on Nov 5 2026 8:50 AM

అడ్వెంచర్‌ క్యాంపునకు గురుకుల విద్యార్థిని

వర్గల్‌(గజ్వేల్‌): జాతీయ అడ్వెంచర్‌ క్యాంపునకు వర్గల్‌ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాల రెండో సంవత్సర విద్యార్థిని నర్రా సమీర ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ భాస్కర్‌రావు తెలిపారు. ఈ నెల 10 నుంచి 28 వరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని హాట్‌కోటిలో జరగనున్న అడ్వెంచర్‌ క్యాంపులో ఆమె తెలంగాణ తరపున పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉస్మానియా వర్సిటీలో నిర్వహించిన రాష్ట్ర ఎంపిక పోటీలలో చక్కని ప్రతిభతో ఎంపికై న ఆమెను ప్రిన్సిపాల్‌తోపాటు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ఎస్‌ రాధారాణి, అధ్యాపకులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement