కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని సైకిల్‌ యాత్ర | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని సైకిల్‌ యాత్ర

Nov 5 2026 8:50 AM | Updated on Nov 5 2026 8:50 AM

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని సైకిల్‌ యాత్ర రాష్ట్ర స్థాయి క్రీడల్లోనూ రాణించాలి రోడ్డుపై గుంతలు.. వెల్లువెత్తిన ఆగ్రహం

మాజీ సీఎంను కలిసిన నాయకులు

మర్కూక్‌ (గజ్వేల్‌): కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు 400 కిలోమీటర్ల ‘మహా సైకిల్‌ యాత్ర’ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి, గోదావరిఖని నాయకులు ఉప్పు రాజ్‌కుమార్‌, బొడ్డు రవీందర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం కరువు బారిన పడకుండా ఉండాలని కాంక్షిస్తూ సైకిల్‌ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. బుధవారం మర్కూక్‌ మండలంలోని కొండపోచమ్మ సాగర్‌కు చేరుకున్న వీరికి మాజీ ఎంపీపీ పాండుగౌడ్‌, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం యాదవ్‌, సర్పంచ్‌ రాణి శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం కొండపోచమ్మ సాగర్‌ను సందర్శించి, ఎర్రవల్లిలోని మాజీ సీఎం వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. యాత్ర పొడవునా ప్రజలు కాంగ్రెస్‌ పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్‌కు వివరించి, ఆయనకు చిత్రపటాన్ని అందజేశారు.

జిల్లా ఇన్‌చార్జి డీఈఓ రమేశ్‌

సిద్దిపేటరూరల్‌: పీఎంశ్రీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో రాణించి, జిల్లా పేరును నిలబెట్టాలని ఇన్‌చార్జి డీఈఓ రమేశ్‌ క్రీడాకారులకు సూచించారు. ఈ నెల 5, 6తేదీలలో గచ్చిబౌలి పోలీస్‌ అకాడమీలో నిర్వహించే కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి అండర్‌–17 క్రీడాకారులు బుధవారం బయలుదేరారు. క్రీడాకారుల బస్సును కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో ఇన్‌చార్జి డీఈఓ రమేశ్‌, జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి భాస్కర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అకాడమిక్‌ మానిటర్‌ ఆఫీసర్‌ రామస్వామి, డీఆర్‌డీపీఓ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

ధర్మారెడ్డిపల్లి వద్ద బీజేపీ ధర్నా, రాస్తారోకో

గజ్వేల్‌: మండలం పరిధి ధర్మారెడ్డిపల్లిలో గజ్వేల్‌–చేగుంట రోడ్డుపై గుంతలకు మరమ్మతు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం అదే ప్రదేశంలో బీజేపీ నేతలు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఆ పార్టీ గజ్వేల్‌ మండల శాఖ అధ్యక్షుడు పంజాల ఆశోక్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. ఫలితంగా రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పంజాల ఆశోక్‌గౌడ్‌, బీజేపీ జిల్లా కార్యదర్శి ఎల్క ంటి సురేష్‌ మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఏడాదిగా రోడ్డు గుంతలు పడి వాహనదారులకు నరకం చూపుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాస్తారోకో సమాచారం తెలుసుకున్న గజ్వేల్‌ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించి విరమింపజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వంజరి రాజు, దివ్యరాజు, ఇప్ప స్వామి, బారు అరవింద్‌, శ్రీకాంత్‌గౌడ్‌, బీనమైన ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement