తాగునీటి సమస్య తలెత్తొద్దు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య తలెత్తొద్దు

Nov 5 2026 8:50 AM | Updated on Nov 5 2026 8:50 AM

● సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చూడాలి

● ప్రభుత్వ ప్రత్యేకప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌

కొండపాక(గజ్వేల్‌): తాగు నీటి సమస్య తలెత్తొద్దని, సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చూసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ పారుశుద్ధ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ సూచించారు. కుకునూరుపల్లి మండలంలోని మంగోల్‌ గ్రామ శివారులో గల మిషన్‌ భగీరథ పథకం వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఫిల్టర్‌ హౌస్‌ను బుధవారం సందర్శించారు. ఫిల్టర్‌ హౌస్‌లో నీటి శుద్ధీకరణ, రోజు వారి నీటి సరఫరా, గ్రిడ్‌ నిర్వహణ తీరును పరిశీలించారు. వాటర్‌ ఫిల్టర్‌ విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా అన్న విషయాన్ని భగీరథ పథకం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిట్టల్‌ మాట్లాడుతూ నీటి సరఫరా విషయాల్లో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా నీరు వృధా చేయకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా రు. వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో ఏమైన సాంకేతికపరమైన సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అంతకు ముందు తిప్పారం శివారులో గల మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును, అక్కడున్న రా వాటర్‌ పంప్‌ హౌస్‌ను పరిశీలించారు. కలెక్టర్‌ హైమావతి నవీన్‌ మిట్టల్‌కు పూలమొక్కను అందించి మర్యాదపూర్వకంగా స్వాగ తించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌, ఇరిగేషన్‌, భగీరథ పథకం అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement