నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 7:41 AM

ములుగు(గజ్వేల్‌)/గజ్వేల్‌: కొండపోచమ్మ సాగర్‌, మల్లన్నసాగర్‌ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె.హైమావతి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీ ఒక్కరి కి ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయం జరిగేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ములుగు మండలంలోని కొండపోచమ్మ సాగర్‌ మామిడ్యాల, బహిలంపూర్‌, తానెదారుపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్‌ నిర్వాసిత కాలనీలను కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీల్లో పరిహారం, పునరావాసం, ప్యాకేజీలు, ఇళ్ల స్థలాలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పెండింగ్‌ సమస్యలను గుర్తించి పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కొండపోచమ్మ సాగర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో చెరువు పక్కన చేపడుతున్న నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ హద్దులను నిర్ధారించాలని కలెక్టర్‌ ములుగు తహసీల్దార్‌ను ఆదేశించారు.

కలెక్టర్‌ హైమావతి

కొండపోచమ్మ సాగర్‌, మల్లన్నసాగర్‌ నిర్వాసితుల కాలనీలు పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement