సమగ్ర అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమగ్ర అభివృద్ధే లక్ష్యం

Sep 23 2026 8:27 AM | Updated on Sep 23 2026 8:27 AM

● హుస్నాబాద్‌ ప్రగతిపై ప్రత్యేక దృష్టి ● మంత్రి పొన్నం ప్రభాకర్‌

● హుస్నాబాద్‌ ప్రగతిపై ప్రత్యేక దృష్టి ● మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌: పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం ఎల్లమ్మ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. చెరువు సుందరీకరణ పనులు, గ్లాస్‌ బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ నిమజ్జన ప్రాంతంలో భద్రత, లైటింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కూరగాయల మార్కెట్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌, చిల్డ్రన్స్‌ పార్క్‌, ఇండస్ట్రీయల్‌ పార్క్‌, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పల్లె చెరువు నుంచి ఎల్లమ్మ చెరువు వరకు నాలుగు లైన్ల రహదారి అనుమతి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.పట్టణంలో అనేక అభివృద్ది పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, త్వరలోనే రాష్ట్ర పెద్దలను తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. హుస్నాబాద్‌లో రాష్ట్ర స్థాయి కబడ్డి పోటీలకు శిక్షణ పొందుతున్న జిల్లా జట్టు క్రీడాకారులకు జెర్సీలు అందజేశారు. అనంతరం పట్టణంలో వివిధ వినాయక మండపాలను సందర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దండి లక్ష్మి, వైస్‌ చైర్‌ పర్సన్‌ చిత్తారి పద్మ, ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement