న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
పక్క చిత్రంలో కనిపిస్తున్నది మద్దూరు మండలం లద్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇందులో 66 మంది విద్యార్థులున్నారు. సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడు సత్తయ్య ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ సబ్జెక్ట్ టీచర్ లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. చేసేదిలేక ఇతర సబ్జెక్ట్ ఉపాధ్యాయులే ఒక్కో తరగతికి సోషల్‌ను బోధిస్తున్నారు. సాంఘిక శాస్త్రంలో ఇంకా రెండు యూనిట్లు చెప్పాల్సి ఉంది. త్వరలో పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఇబ్బంది పడవద్దన్న ఉద్దేశంతో సాంఘికశాస్త్రం విద్యార్థులకు బోధిస్తున్నామని తెలిపారు. ఈ పాఠశాలకు వారం రోజుల క్రితం జెడ్పీహెచ్‌ఎస్ దూల్మిట్ట నుంచి లద్నూరు పాఠశాలకు ఓ ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేశారు. ఉత్తర్వుల్లో మూడు రోజుల్లో జాయిన్ కావాలని ఉన్నా.. ఇప్పటి జాయిన్ కాలేదు.


