కొండా లక్ష్మణ్‌ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

కొండా లక్ష్మణ్‌ సేవలు చిరస్మరణీయం

Sep 22 2026 10:08 AM | Updated on Sep 22 2026 10:08 AM

ములుగు(గజ్వేల్‌): తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు చిరస్మరణీయమని ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ రాజిరెడ్డి అన్నారు. బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం విశ్వవిద్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని వంటిమామిడిలో గజ్వేల్‌ రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు కొక్కొండ సాయిరెడ్డి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. క్లబ్‌ చైర్మన్లు కర్ణాకర్‌రెడ్డి, జగదీశ్వర్‌, కార్యదర్శి బాలకృష్ణ, కోశాధికారి కర్ణాకర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, బాబుగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement